మోదీ స్పీడును అందుకోవటం చాలా కష్టం

December 12, 2015 | 12:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
shinzo-abe-modi-policies-like-bullet-train-niharonline

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ ఓ ప్రత్యేకమైన మనిషిని. సంస్కరణల్లో ఆయన నిర్ణయాలను అందుకోలేమని అబే అన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన ఢిల్లీలో జరుగుతున్న భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ పాలనకు కితాబిచ్చారు.

మోదీ చేపట్టిన ఆర్థిక విధానాలు జపాన్ హైస్పీడ్ ట్రైన్ లా ఉన్నాయని కితాబిచ్చారు. వేగమే కాదు నమ్మకంగా ఉండటంతోపాటు ఆయన చేపట్టే పథకాలు సత్పలితాలను ఇస్తాయని అబే అన్నారు. మేకింగ్ ఇండియా నినాదం ఒక్క భారత్ లోనే లేదని, ప్రస్తుతం అది అన్ని దేశాలకు విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భంగా పౌర అణు ఒప్పందంతో పాటు, తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ. 98 వేల కోట్ల ఒప్పందం, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల ఒప్పందం, స్మార్ట్ సిటీలకు సహకారం వంటి ఒప్పందాలు చేసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ