రాజ్యాంగ నిర్మాత పుణ్యతిథికి మోదీ నివాళులు

December 07, 2015 | 12:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
pm-Modi-releases-commemorative-coins-on-ambedkar_niharonline

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జాతి ఆయనకు ఘన నివాళులర్పించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ఈ సందర్భంగా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. మహాపరినిర్వాణ్ దివస్‌ను పురస్కరించుకుని ఉదయం పార్లమెంటు సముదాయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర నేతలు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.

ఆయన పుణ్యతిథి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గుర్తుచేసుకుంటున్నాను అని ప్రధాని మోదీ ఆ తర్వాత ఫొటోతో పాటు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయం గురించి ఆయన ఎంతో ఆలోచించేవారని, బడుగు బలహీన వర్గాలతోపాటు అందరి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశం పట్ల అంకిత భావం ఉంది కాబట్టే రాజ్యాంగ రచన బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారని తెలిపారు. అనంతరం అంబేద్కర్ 125వ వార్షిక జయంత్యుత్సవాలలో భాగంగా ప్రధాని మోదీ అధికారిక నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.125, రూ.10ల నాణేలను విడుదల చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ