సింహస్థ కుంభమేళాలో ప్రధాని

May 14, 2016 | 12:16 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Modi to address Simhasta kumbh mela in Ujjain

ప్రధాని నరేంద్రమోదీ శనివారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని వెళ్లారు. ఉజ్జయినిలో ' సింహస్థ కుంభమేళా‘లో జరిగే అంతర్జాతీయ సమావేశానికి ఆయన హాజరయి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పవిత్ర స్నానం ఆచరించారు. అంతకు ముందు ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పన్నెండేళ్ల కొకసారి వచ్చే సింహస్థ కుంభమేళా  ఉజ్జయినీలోని  క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్నవిషయం తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దళితులతో, సాధువులతో కలిసి ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించారు. త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్ననేపథ్యంలో దళితులను టార్గెట్ చేస్తూ ఈ కుంభమేళాలో వారిని పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూసుకుంటుంది బీజేపీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ