ఫోర్బ్స్ లిస్ట్ లో పైపైకి భారత ప్రధాని

November 05, 2015 | 11:30 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Narendra Modi is ninth most powerful figure in Forbes list

విపక్షాలు ఏకమై భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనను విమర్శిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఆయన ఖ్యాతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఘనత ఆయన చెంతకు చేరింది. ఫోర్బ్స్ ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. గతేడాది జాబితాలో 14వ స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు 5 స్థానాలు ఎగబాకి 9వ స్థానం దక్కించుకున్నారు. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో ఆయన చేపట్టిన మేధోమథన సదస్సు టెక్నాలజీ పరంగా భారత్ ను బలోపేతం చేసిందని ఫోర్బ్స్ ప్రచురించింది. సంస్కరణల అజెండా విషయంలో తప్పకుండా ఉత్తీర్ణులవ్వాల్సీ ఉందని తెలిపింది. అంతేకాదు ఆగ్రహాంగా ఉన్న విపక్షాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మోదీ తర్వాత భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 36 స్థానంలో ఉండగా భారత సంతతికి చెందిన లక్ష్మీ మిట్టల్ 55, సత్య నాదెళ్ల 61 స్థానంలో నిలిచారు. మొత్తం 73 మందితో కూడిన ప్రపంచ శక్తిమంతుల జాబితా-2015ను ఫోర్బ్స్ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దక్కించుకున్నారు. ‘ఫోర్బ్స్’ జాబితాలో టాప్ టెన్ వీరే....

1. వ్లాదిమిర్ పుతిన్-రష్యా అధ్యక్షుడు

2. ఎంజెలా మోర్కెల్-జర్మనీ ఛాన్సెలర్(మహిళ)

3. బరాక్ ఒబామా-అమెరికా ప్రెసిడెంట్

4. పోప్ ఫ్రాన్సిస్

5. జి జిన్ పింగ్-చైనా అధ్యక్షుడు

6. బిల్ గేట్స్

7. జానెట్ ఎల్లెన్-యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్(మహిళ)

8. డేవిడ్ కామెరాన్-బ్రిటన్ ప్రధాని

9. నరేంద్ర మోదీ-భారతదేశ ప్రధాని

10. లారీ పేజ్ -గూగుల్ వ్యవస్థాపకుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ