ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ఆయన మహిళలకు వందనం అంటూ ట్వీట్ చేశారు. సమాజంలో వారి పాత్రకు, వారు సాధిస్తున్న విజయాలకు సెల్యూట్ చేశారు. మన ‘నారీ శక్తి’ సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందంటూ మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘బేటీ బచావో బేటీ పడావో’ ద్వారా బాలికా విద్యను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి సెంటర్లు, ముద్రా బ్యాంకు మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాయని, ఇది భారత వృద్ధిరేటుకు తోడ్పడుతుందని మోదీ అన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆయన రాష్ట్రపతి భవన్‌లో జరిగే ‘నారీ శక్తి అవార్డు’ల ప్రధానంలో పాల్గొననున్నట్లు తెలిపారు. భారత్‌లో మహిళలకు ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయి గౌరవం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.