ప్రభుత్వ విజయాలే ఆయుధాలు

May 05, 2016 | 05:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
govt-schemes-our-weapon-modi-to-ministers-niharonline

ప్రతిపక్షాలను తిప్పి కొట్టే సరైన ఆయుధం ఎన్టీయే ప్రభుత్వం సాధించిన విజయాలేనని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు, పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు. పార్లమెంట్‌లోని లైబ్రరీ హాల్‌లో బుధవారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సినీయర్ నాయకులు ఎల్‌కే అద్వానీ, మంత్రివర్గ ముఖ్యులు, పార్టీ ఎంపీలు హాజరైయ్యారు.

                                  ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ముద్రా పథకం, 18 వేల గ్రామాలకు విద్యుత్ వెలుగులు, మూడు కోట్ల కుటుంబాలకు ఎల్‌పీజీ సౌకర్యం, ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ వంటి ప్రభుత్వ ముఖ్య పథకాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం 26 మే, 2014న అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుని వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ