ఆల్జీబ్రా ఫార్ములాకి ప్రధాని సరికొత్త భాష్యం

April 17, 2015 | 01:09 PM | 120 Views
ప్రింట్ కామెంట్
modi_alzebra_formula_niharonline

(ఏ+బీ)2 ఈ ఆల్జీబ్రా ఫార్ములాను విప్పమంటే... ఇప్పటికీ చాలా మంది తడబడటం తెలిసిందే. అదే 60 ఏళ్ల పైబడ్డ వయసు, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో మునిగితేలుతున్న ప్రధాని నరేంద్ర మోదీ గుక్క తిప్పుకోకుండా అప్పజేప్పేశారు. ‘‘(ఏ+బీ)2 అంటే ఎంత ఏ2+బీ2+2ఏబీ అంతేగా... ఈ ఫార్ములాలో ఏ2, బీ2 మాములే మరి, 2ఏబీ ఎక్కడి నుంచి వచ్చింది. అది లేకుంటే ఈ ఫార్ములానే తప్పుకదా. అలాగే భారత్, కెనడా మధ్య సంబంధాలు కూడా 2ఏబీ లాంటివే‘‘ అని ఆయన అభివర్ణించారు. ఇక మోదీ వెంట ఆల్జీబ్రా ఫార్ములా వినిపించేసరికి అక్కడనున్న కెనడా ప్రధానితోసహా పలువురు భారతీయులు హర్షాధ్వానాలు చేశారు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ