ప్రధాని పీఠం ఎక్కక ముందునుంచే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న వ్యక్తి నరేంద్ర మోదీ. ఇప్పుడు తాజాగా మరో ఫీట్ ను సాధించారు. యు-గవ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ అత్యంత ఆరాధ్య పురుషుడు జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఐదో స్థానం దక్కింది. ఈ జాబితాలో మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కు ఆరో స్థానం దక్కటం విశేషం. మొత్తం 23 దేశాల్లో యు-గవ్ సంస్థ చేపట్టిన అధ్యయనం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్, నటుడు జాకీచాన్ లు ఉన్నారు. బౌద్ధ మతగురువు దలైలామా ఏడో స్థానంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 11వ స్థానంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 14 వస్థానంలో ఉన్నారు. ఇక మహిళల విషయానికొస్తే హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీ ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది. బాలల ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయి, హిల్లరీ క్లింటన్, ఎలిజబెత్ రాణి, మిచెల్లి ఒబామా. తదితరులు ఉన్నారు. ఇక భారత్ తరపునుంచి సోనియాగాంధీ ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు.