భారత ఆర్థిక వ్యవస్థను 20 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న కలనైనా మనం కనకూడదా అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఢిల్లీలో జరుగుతున్న ది ఎకనమిక్స్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఎకానమీ, సంస్కరణల అమలు తర్వాత శరవేగంతో దూసుకువెళ్లేలా చేస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి ఫలాలు ఉద్యోగ సృష్టిలో కనిపించాలని, పేదలకు సబ్సీడీలు సక్రమంగా అందేందుకు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకువస్తామని తెలిపారు. రూ.100 లక్షల కోట్లుక పైగా ఉన్న ఆర్థిక వ్యవస్థను రూ.1,000 లక్షల కోట్లకు చేర్చాలన్నదే తన దీర్ఘకాల లక్ష్యమని ఆయన వివరించారు. మెరుగైన పరిపాలన కోసం నిత్యమూ కృషి చేస్తానని మోదీ పేర్కొన్నారు.