ఫ్రధాని నరేంద్ర మోదీ ఈఏడాది రెండోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ లో ఏకంగా మూడు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటిస్తారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. తొలుత మోదీ 9న ఫ్రాన్స్ వెళ్లనున్నారు. అక్కడ వివిధ విభాగాల వారిని, ప్రముఖ నేతలను కలిసి చర్చిస్తారని వివరించారు. తర్వాత 12న తిరిగి జర్మనీ చేరుకుని 14 వరకు అక్కడే ఉండనున్నారు. చివరిగా ఆరోజు సాయంత్రం బయలుదేరి జర్మనీ వెళ్లి 16వరకు ప్రధాని అక్కడుంటారు. ఈసమయంలో కెనడా పీఎం స్టీఫెన్ హార్వర్ తో ప్రధాని చర్చలు జరనున్నట్టు అధికార ప్రతినిధి పేర్కొన్నారు.