భిన్నత్వంలో ఏకత్వమే మన బలం

March 18, 2016 | 03:10 PM | 1 Views
ప్రింట్ కామెంట్
pm-modi-world-sufi-forum_niharonline

సూఫీజం ప్రేమకు పుట్టినిల్లని, ఉగ్రవాదానికి సహకరించదని , సరిహద్దు దేశాల్లో ఇదే జరిగితే, ఉపఖండం ఈ భువిపైనే స్వర్గంతో సమానమవుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అల్లాకు 99 పేర్లున్నాయని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా హింసను ప్రేరేపించేది కాదని వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల పాటు సాగనున్న వరల్డ్ సుఫీ ఫోరమ్ సమావేశాల్లో తొలిరోజున పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే చురకలు వేశారు. అన్నారు. ఉగ్రవాదం మనల్ని విడగొట్టి నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రస్తుత కాలంలో ఉగ్రవాదం, తీవ్రవాదం సమాజం ముందు సవాళ్లను విసురుతున్నాయని అన్నారు.

                     ప్రతి సంవత్సరమూ ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, గత సంవత్సరం 90 దేశాలు ఉగ్రదాడులకు గురయ్యాయని గుర్తు చేశారు. సిరియాలో జరుగుతున్న యుద్ధంలో తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు నిత్యమూ ఆ బాధను అనుభవిస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని పిలుపునిచ్చారు. "మన ప్రజలలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్దులు, పార్సీలు, నమ్మేవాళ్లు, నమ్మని వాళ్లు... ఇలా రకరకాల వాళ్లున్నారు. వీరంతా భారతావనిలో భాగమే. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం" అని వివరించారు. ఈ భిన్నత్వంలోనే సూఫిజం పుట్టి భారతావనిలో విరాజిల్లిందని అన్నారు. ఆల్ ఇండియా ఉలామా అండ్ మషైక్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు 200 మందికి పైగా మత గురువులు, స్కాలర్స్ హాజరయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ