అమీర్ ఖాన్ ఇక అనుభవించక తప్పదా?

November 25, 2015 | 04:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Aamir_khan_intolerance_statement

మత అసహనం వ్యాఖ్యలపై బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. తస్లీమానస్రీన్, అక్బరుద్దీన్ ఓవైసీ, యోగి ఆదిత్య, షానవాజ్ హుస్సేన్, అనుపమ్ ఖేర్, రాంగోపాల్ వర్మ, రవీనా టండన్ లాంటి వాళ్లు అమీర్ వ్యాఖ్యలను ఖండించారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయితే నిరసనలతో అమీర్ ఖాన్, అతడి భార్య కిరణ్ రావు ఓ నిర్ణయానికి వచ్చారట.

మత అసహనం వ్యాఖ్యలపై అమీర్ ముంబైలో వివరణ ఇస్తూ, భారతీయుడినైనందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పాడు. తన ఇంటర్వ్యూ చూడని వారే తనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపాడు. గతంలో తాను చేసిన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నానని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. తన దేశ భక్తికి ఎవరి కితాబు అక్కర్లేదని అమీర్ చెప్పాడు. తాను అచ్చమైన భారతీయుడినని, దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని అమీర్ ప్రకటించాడు. భారత గడ్డపై జన్మించడం తన అదృష్టమని అమీర్ ఖాన్ తెలిపాడు. తనకు కానీ, తన భార్యకు కానీ దేశం విడిచి వెళ్లాలన్న ఆలోచన లేదని అమీర్ ఖాన్ వివరించాడు.

అలాగే కొడుకుని తీసుకుని కొన్నిరోజుల పాటు ముంబయికి దూరంగా ఎక్కడికైనా వెళ్లమంటూ తన భార్యకు అమీర్ ఖాన్ చెప్పాడని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతం ముంబయిలో ఉండటం మంచిది కాదని అమీర్ తన భార్యకు చెప్పినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి. ‘మీ రక్షణ గురించి నాకు భయంగా ఉంది. రెండు, మూడు రోజులు ముంబయికి దూరంగా వెళ్లండి’ అంటూ అమీర్ తన భార్యతో అన్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఇకపై మీడియాతో దేశానికి సంబంధించిన విషయాలేవీ వ్యక్తం చేయొద్దని నిర్ణయించుకున్నారట.

కాగా, అసహనం పై అమీర్ చేసిన వ్యాఖ్యల అనంతరం హిందూ మత సంస్థలతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు మండిపడిన విషయం తెలిసిందే. ముంబయి లోని అమీర్ ఖాన్ నివాసం ముందు హిందూ సేన మంగళవారం నాడు నిరసనలు వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల అమీర్ పై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబర్ 1న కాన్పూర్ సెషన్స్ కోర్టులో హాజరుకావాలని ఆయనకు సమన్లు కూడా జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇకపై ఆయన సినిమాలు ఎలా ఆడతాయో, అసలు బయట ప్రచారాలకు ఎలా తిరుగుతాడో చూడాలి మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ