ఎవరెన్ని విమర్శలు చేసిన కేవలం పరిపాలన మీద మాత్రమే తన ద్రుష్టి అంతా ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు పాలనపై ప్రభావం చూపబోవని ఆయన అంటున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను మీడియా పార్టీలో విభేదాల గురించి ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. పరిపాలనేతర విషయాలపై స్పందిచనని స్పష్టంచేశారు. పార్టీ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలపట్ల చెప్పటానికి ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. మీడియాలో ప్రచారం పొందడం కోసం తనను ఏమైనా తిట్టొచ్చని, అవి తన ప్రభుత్వంపై ప్రభావం చూపలేవని చెప్పారు.