మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన హోం మంత్రి

April 21, 2016 | 04:38 PM | 1 Views
ప్రింట్ కామెంట్
babulal-gaur-touch-woman-niharonline

ఆయన పేరుకే రాష్ట్ర మంత్రి... పైగా వయో వృద్ధుడు కూడా. కానీ, చేసేది మాత్రం పరమ చెత్త పనులు. ఆయనే మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్. మంత్రి పదవిలో ఉండి ఆయన చేసిన పనులకు సమాధానం చెప్పులేక పోతుంది బీజేపీ. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఓ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. కార్యకర్తలు హడావుడిగా బస్సు ఎక్కడం ఆరంభించారు. అంతలోనే బస్సు ఎక్కబోతున్న మహిళలను ఆయన చెప్పుకోరాని చోట టచ్ చేసి ఎక్కండంటూ ప్రోత్సహించారు. ఆయనగారి వెకిలిచేష్టల బాగోతం మొత్తం సీసీ కెమెరాల్లో క్లియర్ గా నమోదు అవ్వటంతో ప్రస్తుతం విమర్శలు చెలరేగుతున్నాయి. ఆయన ఎప్పుడూ ఏం మాట్లాడతారో... ఏం చేస్తారోనంటూ టెన్షన్ పడే పార్టీకి ఇప్పుడు మరింత తలనొప్పిగా మారింది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ