కశ్మీర్ వేర్పాటువాది మసరత్ ఆలం భట్ బెయిల్ పిటిషన్ ను శ్రీనగర్ లోని బుడ్గామ్ స్థానిక కోర్టు తిరస్కరించింది. అయితే కోర్టు బెయిల్ ఎందుకు తిరస్కరించిందో పూర్తి ఆర్డర్ కాపీ తమకు అందాకే తెలుస్తుందని ఆలం న్యాయవాది షబ్బీర్ అహ్మద్ భట్ తెలిపాడు. దేశంపై యుద్ధానికి సిద్ధపడటం, దేశద్రోహాం అభియోగాల కింద 45 ఏళ్ల ఆలంను గతవారం జమ్ము పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట అతనిపై ప్రజా భద్రతా చట్టాన్ని విధించారు. దాంతో ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్లపాటు అతను జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆలం జమ్ములోని కొట్ భల్వాల్ జైల్లో సేదతీరుతున్నాడు.