అదేంటి 17 ఏళ్ల పార్టీల అనుబంధాన్ని కాదనుకొని కూటమి నుంచి పక్కకు జరిగిన జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మోదీని కలవటం ఏంటనుకుంటున్నారా?. సందు దొరికితే చాలు కేంద్ర ప్రభుత్వం విమర్శల వర్షం గుప్పిస్తున్న నితీశ్ తనంతట తానుగా వెళ్లి మోదీని కలవటంలో ఆశ్చర్యపోవటం సహజమే. అయితే మరీ అంతలా ఆశ్చర్యపోకండి... ఎందుకంటే నితీశ్ మోదీని కలిసింది బీహార్ అభివ్రుద్ధికి సంబంధించిన పనుల కోసం. భేదతారమ్యాలను పక్కనబెట్టి గురువారం బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రాభివ్రుద్ధి కోసం వెనుకబడిన వర్గాలవారి సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని ఆయన ప్రధానిని కోరాడు. ప్రభుత్వ కొత్త సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలంటే కేంద్రం నుంచి భారీగా నిధులు రావాల్సిన అవసరం ఉందని సమావేశమనంతరం ఆయన మీడియాతో చెప్పారు. నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రధానితో తొలిసారి కలవటంతో ఈ సమావేశం అందరి ద్రుష్టిని ఆకర్షించింది.