పవన్ మాట తప్పాడు అందుకే వదిలేశా: పీవీపీ

May 14, 2016 | 05:20 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Why-PVP-came-out-of-Pawan-Janasena

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిర్మాత, పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాద్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని కుదిరి ఉంటే ఇప్పుడు శరత్ మరార్ ఉన్న ప్లేస్ లో పీవీపీ ఉండేవాడు. కానీ, రాజకీయాలు వీరిద్దరి మధ్య చిచ్చును పెట్టాయి. విజయవాడ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన పీవీపీకి పవన్ సాయం చేయలేదని, అందుకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు అప్పట్లో బాగానే హల్ చల్ చేశాయి. అటు దీనిపై పవన్ నుంచి గానీ, ఇటు పీవీపీ నుంచి గానీ ఎటువంటి స్టేట్ మెంట్ రాలేదు. కానీ, మీడియా ఊరుకుంటుందా? ప్రస్తుతం బ్రహ్మోత్సవం ప్రమోషన్ లో ఉన్న పీవీపీ ని ఈ విషయమై ఆరాతీసింది. దీనిపై పీవీపీ కూడా చాలా డీటైల్డ్ గా సమాధానమిచ్చారు.

                                   నిజానికి పవన్ ముందు రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదంట. రాజకీయాలతో సంబంధం లేని ఓ ఎన్టీవోని పెట్టాలని అనుకున్నాడంట. తద్వారా ప్రజలకు సాయం అందించడంతోపాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు కూడా ఉంటుందని వీరిద్దరు అనుకున్నారంట. రాజకీయాలపై అంతగా తనకు ఆసక్తే లేదని, అందుకే పవన్ స్వచ్ఛంద సంస్థకు స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పాడు. కానీ, చివరికి జనసేనకు బీజం పడటంతో నచ్చక తాను బయటికి వచ్చేశానే తప్ప, తానేం ఎంపీ టికెట్ ఆశించి భంగపడలేదని పీవీపీ చెప్పుకోచ్చాడు. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ తాను రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో రానని ప్రకటించాడు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ