పిల్లకాకికి ఉండేలు దెబ్బ..

September 30, 2015 | 05:47 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Nara_lokesh_sad_niharonline

తెలుగు దేశం కార్యకర్తల వెల్ఫేర్ ఫండ్ కో ఆర్డ్ నేటర్ లోకేష్ అంటే వెంటనే తట్టదు. బాబుగారి చిన బాబు అంటే ఓహో తెల్సులే అంటారు. ఆస్తి లెక్కలు వెల్లడించి తన్నుకు చావండి అన్న చందాన నారా లోకేష్ తన మానాన్న మరో కొత్త కాన్సెప్ట్ టేకప్ చేసేడు. తెలుగుదేశం కార్యకర్తల అంతరాంతరాల్లో గల నాయకత్వ లక్షణాలను పైకి గుంజి, సానబెట్టి, కత్తిలాంటి నాయకుల్ని తయారుచేయడం లోకేశ్వరుడి ఆశయం. ఒక సంవత్సరంలో 45 వేల మంది చాకుల్ని పార్టీకి సమర్పించాలని వీరి మదుద్ధేశం.

ఇన్ని వేల మంది కార్యకర్తలు సుశిక్షితులైన నాయకత్వ లక్షణాలు పుంజుకున్న తదనంతరం, గోళ్లుగిల్లుకుంటారు. కూర్చుంటారనుకుంటే భ్రమేమరి.

నాయక శ్రేష్టుడైన నాదెండ్ల ఉన్నపుడే నాన్నగారూ, తాతగారూ మూడు చెరువుల నీళ్లు తాగి, చుక్కలు చూసిన చరిత్ర అమ్మ భువనమ్మ నీకు చెప్పలేదయా లేకేషూ

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ