సీమాంధ్రుల కోసం మరీ ఇంత త్యాగమా?

January 11, 2016 | 03:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
erraballi-dayakar-rao-on-GHMC-mayor-niharonline

గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో అధికార, ప్రతిపక్షాలు గ్రేటర్ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త తాయిలాలతో గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రచారం మొత్తాన్ని కేటీఆర్ భుజానవేసుకుని నడిపిస్తుండగా, బీజేపీ, టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. తాజాగా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

                               గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే సీమాంధ్రుడ్నే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేటర్ గా చేస్తామని అన్నారు. హైదరాబాదు అభివృద్ధికి సీమాంధ్రులే కారణమన్నారు. ఆస్తులు అమ్ముకుని వచ్చి మరీ పెట్టుబడులు పెట్టి హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దారని ఆయన సీమాంధ్రులను ఆకాశానికెత్తారు. సీమాంధ్రులు టీడీపీతో ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అబద్ధాలు చెప్పి సీమాంధ్రుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమిపాలైతే కేటీఆర్ రాజీనామా అవసరం లేదని, టీడీపీలో పోటీ చేసి, టీడీపీ పెట్టిన భిక్షతో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్తారా? అని సవాలు విసిరారు. అయితే పార్టీ నేతలతో సంప్రదించకుండా ఇలా నొటికొచ్చినట్లు వాగ్దానాలు చేయటం ఏంటని తెలంగాణ తమ్ముళ్లు ఎర్రబెల్లిపై గుస్సాతో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ