రామ రాజ్యంలోనూ రేప్ లు జరిగాయంట

December 16, 2015 | 10:20 AM | 1 Views
ప్రింట్ కామెంట్
UP-DGP-jagmohan-rape-rama-rajyam-comments-niharonline

దేశంలో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చట్టసభల్లో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా న్యాయవ్యవస్థలోని లోపాలను సాకుగా చూపి నిందితులు సులువుగా పరారైపోతున్నారు. ఇక అత్యాచారాలకు కేంద్రంగా మారిన ఉత్తరప్రదేశ్ లో వాటిపై వివాదాస్పద వ్యాఖ్యలకూ కొదవ లేదు. సాక్షాత్తు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతమూ అధికారంలో ఉన్న పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అత్యాచారాలపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు శాంతి భధ్రతలను పరిరక్షించే ఆ రాష్ట్ర డీజీపీ జగ్మోహన్ యాదవ్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు.

అత్యాచారాలు సర్వ సాధారణమని, రామ రాజ్యంలోనూ బలాత్కారాలు జరిగాయని ఆయన నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో నెలలో పదవీ విరమణ చేయనున్న జగ్మోహన్ యాదవ్ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అత్యాచారాలపై తనను ప్రశ్నించిన ఓ విలేకరిని తన గదిలోకి వస్తే సవివరంగా సమాధానమిస్తానని చెప్పి ఆయన మీడియాకు షాకిచ్చారు. జగ్మోహన్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. పోలీస్ బాస్ నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావటంతో మీడియా సైతం విస్తూ పోయి విమర్శలు ప్రారంభించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ