కామ పొలిటికల్ లిస్ట్ లో టాప్ ఎవరంటే?

December 17, 2015 | 11:16 AM | 1 Views
ప్రింట్ కామెంట్
YSRCP_leaders_top_in_call_money_niharonline

కాల్ మనీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు అంతకంతకూ పెరుగుతోంది. అధిక వడ్డీ రేటుకి వసూళ్లకు పాల్పడటంతోపాటు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఈ దందా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బ్లూ ఫిల్మ్ లు చిత్రీకరించి వారిని రాజకీయ నేతల దగ్గర తాల్చటం లాంటివి చేయటంతో ఆ కర్కోటకుల పనిపట్టేందుకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు.  గత నాలుగు రోజులుగా విజయవాడ సహా చుట్టుపక్కల నాలుగు జిల్లాలో పోలీసుల దాడులు ముమ్మరం అయ్యాయి. ఏపీ పోలీసుల తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 118 మంది అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో, కాల్ మనీ వ్యాపారులకు రాజకీయ నేతలతో ఉన్న లింకులు కూడా బయటపడుతున్నాయి.

పట్టుబడ్డ వారిలో వైకాపాకు చెందిన వారే అధికంగా ఉండటం గమనార్హం. అరెస్ట్ అయిన వారిలో 44 మంది వైకాపా, 20 మంది టీడీపీ, 13 మంది కాంగ్రెస్, ఆరుగురు సీపీఐ వర్గీయులు ఉన్నారు. మిగిలిన వారికి ఏ పార్టీలతో సంబంధం లేదు. మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లాలో కాల్ మనీ వ్యాపారులపై పోలీసులు నిఘా పెంచారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, చింతలపూడి, ఏలూరు, జంగారెడ్డిగూడెంలలో మొత్తం 12 కేసులు నమోదవ్వగా, 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దాడుల నేపథ్యంలో కాల్ మనీ వ్యాపారులంతా అండర్ గ్రౌండ్ లోకి పారిపోతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకిపోవటంతో తమ పార్టీకి చెందిన నేతలే అధికంగా ఉండటంతో జగన్ ఏం సమాధానం చెబుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ