బాబోయ్ మోదీని నేనేప్పుడూ పొగడలేదు

January 22, 2015 | 03:46 PM | 71 Views
ప్రింట్ కామెంట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాను ప్రశంసించినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేత జనార్ధన్ ద్వివేది స్పందించారు. మోదీ భారతీయతకు చిహ్నమని ద్వివేది అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అంతేకాదు, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబోతుందన్న సంకేతాలు కూడా వెలువరించింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది అంటున్నారు. భారతీయతకు మోదీ చిహ్నమని ఎవరంటున్నారూ ప్రశ్నించారు. ఆ మాటలు తాను అనలేదని స్పష్టం చేశారు. కాగా, రెడిఫ్. కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్వివేది ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనను వివరణ ఇవ్వాలనే కోరుతుంది. పాపం ద్వివేది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ

SELECT articles.alias as alias,categories.alias as cat_alias, sub_category.alias as sub_alias, articles.img as img, articles.title as title FROM articles join categories on articles.cate_id=categories.id join sub_category on articles.sub_cate_id=sub_category.id WHERE articles.id = (SELECT MAX(a.id) FROM articles as a WHERE a.id >= "1025" AND a.cate_id =6 AND a.sub_cate_id =34)