టీ సీఎం కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చేందుకు స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బరిలోకి దిగారు. అసలు తెలుగు దేశం పార్టీయే లేకపోతే కేసీఆర్ సిద్ధిపేటలో గొర్రెలు మేపుకునేవారని కాస్త ఘాటుగానే వ్యాఖ్యనించారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం రమ్మంటే కేసీఆర్ అసలు ముందుకే రావటం లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ... రెండు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు పరిష్కారం కాకుండా జఠిలమౌతున్నాయని, కనీసం కేంద్రం అయినా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. అదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చోరవ చూపాలని విజ్ణప్తిచేశారు. హైదరాబాద్ లో తనకు పనేంటని కేసీఆర్ అన్నారని, అలా అనేందుకు ఆయనకు ఏ హక్కు ఉందని బాబు ప్రశ్నించారు. అసలు టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడుండేవాడని వ్యాఖ్యానించారు. అవునవును... కలుసుకున్నప్పుడు మైత్రి, కలబడినప్పుడు పదాలు దూసుకోవటం వీరిద్దరికి మాములే... చూసితరించటం మనకూ మాములే... కానివ్వండి.