కేంద్రం దృష్టిలో ఏపీ ఓ ఈక!

November 24, 2015 | 11:00 AM | 2 Views
ప్రింట్ కామెంట్
no-funds-from-central-during-floods-niharonline

కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంద్రప్రదేశ్ కి పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ప్ర్యతేక హోదా విషయంలో ప్యాకేజీని పక్కనబెట్టి అన్యాయం చేసిన ఎన్డీయే ప్రభుత్వం అదే సీన్ ను మరోసారి రిపీట్ చేసింది. చిన్న చిన్న సంబరాలతో సరిపెడతూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎదుగుదలకు ఆస్కారం ఇవ్వకుండా చేస్తుంది. మిత్ర పక్ష కూటమిలో ప్రధాన పార్టీ అయినప్పటికీ, మంత్రివర్గంలో టీడీపీకి చోటు ఉన్నప్పటికీ, వరాల విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. అవసరానికి వాడుకుంటూ పక్కనపెడుతూ వస్తుంది.

ఇంతకీ విషయమేంటంటే... ఇటీవల తీవ్ర వరదలతో ఏపీలో అపార నష్టం సంభవించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తుపాను, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని ఆయన గురువారమే కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాశారు. ఏపీలో వరదల కారణంగా ప్రాథమికంగా 3 వేల కోట్ల మేర నష్టం జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జరిగిన మొత్తం నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని పేర్కొన్నారు.

                                     లేఖ అంది నాలుగు రోజులు గడిచినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం మాత్రం దారుణం. అయితే టైంలో తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడుకు కేంద్రం తక్షణ సాయం ప్రకటించటంతో ఏపీ విషయంలో మరోసారి కేంద్రం వివక్షత క్లియర్ గా తెలిసిపోయింది. సోమవారం ఉదయం తమిళనాడు సీఎం జయలలిత ప్రధానికి లేఖ రాయగా, మధ్యాహ్నంకు 940 కోట్లు సహాయాన్ని ప్రకటించింది. లేఖ అందిన టైంలో మలేషియా పర్యటనలో ఉన్న ఆయన లేఖపై త్వరగతిన స్పందించారు. నిజానికి చంద్రబాబు లేఖ రాసిన సమయంలో మోదీ భారత్ లోనే ఉన్నారు. అయినా కిక్కురుమనకుండా ఉంటంతో ఏపీ పట్ల ఆయనకున్న ప్రేమ ఏపాటిదో క్లియర్ గా తెలిసిపోయిందని అర్థమౌతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ