పవన్ విషయంలో చిరుతో విభేదించాడు

May 04, 2016 | 12:31 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dasari-narayana-rao-about-pawan-political-entry-niharonline

ఓ రెండు మూడు సినిమాలు తీశాక పూర్తిస్థాయి రాజకీయాలపైనే దృష్టిసారిస్తానని, సినిమాలకు గుడ్ బై చెబుతానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ చిరు ఏం చెబుతారని అంతా ఎదురుచూశారు. సర్దార్ ఆడియో వేడుకలో చిరు మాట్లాడుతూ... సినిమాలు ఆపుతాను అని పవన్ చెప్పినప్పుడు తానోక సలహా ఇచ్చానని అన్నాడు. దయచేసి సినిమాలకు దూరం కావొద్దని, నువ్వు రెండు గుర్రాల మీద( సినిమాలతోపాటు రాజకీయాలు) ప్రయాణించే సామర్థ్యం ఉన్నవాడివని, నీ ప్రయాణం ఆపొద్దని తమ్ముడి గురించి బాగా చెప్పుకోచ్చాడు. అయితే దీనిపై పలువురు పొలిటిషన్ లు సెటైర్లు వేశారు. పవన్ దగ్గర పొలిటికల్ స్టఫ్ లేదని, కేవలం సినిమా క్రేజ్ తోనే జనాకర్షణ ఉందని ఎద్దేవా చేశారు. అయితే దర్శకరత్న దాసరి మాత్రం పవన్ గురించి కాస్త భిన్నంగా స్పందించారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా దాసరి మీడియాతో మాట్లాడుతూ... అంకితభావం, మాటమీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్‌కల్యాణ్‌. అలాంటి వ్యక్తి రాజకీయ ప్రవేశం ఆనందదాయకం. అయితే రెండు, మూడు సినిమాల తర్వాత నటనకు దూరమవుతానని ఆయన ప్రకటించడంపై నా అభిప్రాయం ఏమిటంటే, రెండు పడవలపై ప్రయాణం చేయకూడదనేది నా భావన అంటూ తెలిపారు. ఓవైపు చిరు ఏమో రెండు పడవల ప్రయాణానికి ఉసిగొల్పుతుంటే, దాసరి మాత్రం అంత రిస్క్ చెయ్యొద్దని చెప్పటం విశేషమే మరి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ