గులాబీ ప్రభుత్వం ప్రచారానికి మరిగిందట

April 03, 2015 | 01:55 PM | 46 Views
ప్రింట్ కామెంట్
digvijay_singh_TRS_govt_niharonline

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారానికి అలవాటుపడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు దశ దిశ లేవన్నారు. ఇది ఒక పెద్ద స్కాం అన్నారు. కేవలం పైపుల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు మాత్రమే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి విభజన చట్టంలో ఉన్నాయన్నారు. ఈ హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విభజన చట్టం అమలులో విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా కేంద్రం చిన్నచూపుచూస్తోందన్నారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏపిసిసి కోటి సంతకాలతో ఉద్యమం చేపట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 19వ తేదీన ఎన్డీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో తలపెట్టనున్న కిసాన్ ర్యాలీలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాహుల్ తమ పార్టీ అగ్రనేతని, భవిష్యత్తులో పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తారన్నారు.  భూసేకరణ చట్టం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ తెచ్చిందన్నారు. కాని బిజెపి ప్రభుత్వం రైతులకు హానీ చేసే అంశాలను ఈ చట్టంలో చేర్చిందన్నారు. ఆర్డినెన్సు జారీ చేసే ముందు ఎటువంటి చర్చ జరగకుండా బిజెపి తొందరపడుతోందన్నారు. 2013లో భూసేకరణ చట్టం పార్లమెంటు ఏకగ్రీవ ఆమోదం పొందిందన్నారు. వాటిని సవరించాల్సిన అవసరం లేదన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ