కొత్త జిల్లాలతో గుత్తాకి వచ్చే నష్టమేంటి?

November 14, 2015 | 04:37 PM | 2 Views
ప్రింట్ కామెంట్
gutta-sukendar-on-telangana-districts-niharonline

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలనా సౌలభ్యంతోపాటు వచ్చే ఎన్నికల్లోగా పార్టీపై పట్టు కోసం కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చింది టీఆర్ఎస్. అయితే ఇదేం కొత్త అంశం కాదు. ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచే వచ్చింది. ఇక అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని మళ్లీ తెరమీదకు తెచ్చింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటుచేసి ముందుకెళుతోంది. వచ్చే ఏప్రిల్ లోగా సూర్యాపేట జిల్లా ఏర్పడి తీరుతుందని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అయితే దీనికి అడ్డు చెబుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్. కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సీఎస్ కు గుత్తా విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ కొత్త జిల్లాల ఏర్పాటును గతం నుంచే వ్యతిరేకిస్తూ వస్తుంది. నియోజకవర్గాల విభజన ద్వారా తెలంగాణకు ఒరిగేది ఏం ఉండదని వాదిస్తూ వస్తుంది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల ముందు కాంగ్రెస్ ఎంత గగ్గోలు పెట్టినా వ్యర్థమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ