సనత్ నగర్ మాది, తెలంగాణ మాది, మాదే అంటూ శ్రీపతి రాజేశ్వర్, కాట్రగడ్డ ప్రసూన, మర్రిశశిధర్ రెడ్డి, తలసాని ప్రభృతులు ఎలుగెత్తి చాటినవారే. పాత వాసనలంత తొందరగా ఎలా పోతాయ్. చెన్నారెడ్డిగారి శశిధర్ రెడ్డి సదరు నియోజకవర్గంలో సంభవించిన ఘోర దురంతానికి తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. తలసాని తలపడిన రాజకీయ హైజంపు సారుకి మింగుడుపడటం లేదు. మళ్లీ ఎన్నికలొస్తే తలసాని పని సరిగమపదనిసే అనేది మర్రివారి మనసులోని మాట. ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను వద్దనుకునేవారు, సెటిలర్స్ అని పిలవబడే విస్తరణ సామ్రాజ్య వాదుల ఓట్లను గల్లంతు చేస్తున్నారని, ఇప్పటికి దాదాపు 54 శాతం ఆబాపతు ఓట్లు గాయబు అయిపోయాయని శశిబాబు వెల్లడించేడు. ఈ అఘాయిత్యం అంతు తేలుస్తాని కూడా అన్నాడు. గవర్నరు టీఆర్ఎస్ కార్యకర్త అని కూడా ఆరోపించేడు. పొరుగింటి పౌరుల మీద ఎందుకింత మమకారం, తొటి పౌరుల మీద ఎందుకింత సూరే కారం. లోతుగా చర్చించే ప్రమాదమైన అంశం!
మర్రి చెట్టు క్రింద ఓట్ల విత్తనాలు మొలకెత్తడం లేదని వర్రీ అవుతున్న మర్రి ని ఎప్పుడైనా చూశారా!