అశలు మిణకు మిణుకు మంటున్న ఎందుకు వదలాలి అనుకుందో ఏమో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికలపై ద్రుష్టిసారించింది. సీనియర్ నేతలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రచారంలోకి దింపింది. ఇక ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. మోదీ వల్ల పేదలకు ఏం ఒరగలేదని, వాళ్లు పేదవాళ్లు గానే మిగిలిపోతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు. అసలు మోదీ వల్ల పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూరుతోందని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం మోదీ పాకులాడుతున్నారని విమర్శించాడు. పని ఎప్పుడు మొదలుపెడతారని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారని అన్నారు. మాటలు చెప్పటం కాదని, చేతల్లో చూపాలని ప్రధానికి సవాలు విసిరాడు. పేదల కోసమైనా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాడు.