ఆ పార్టీ మునిగిపోతున్న నావ... దానికి ఆయనో కెప్టెన్

April 21, 2015 | 02:30 PM | 35 Views
ప్రింట్ కామెంట్
shiv_sena_slams_sitaram_yechuri_niharonline

సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన సీతారాం ఏచూరికి శివసేన పార్టీ చురకలంటించింది. లెప్ట్ పార్టీ ఈ దేశంలో ఔచిత్యం కోల్పోయిందని, బలమైన ప్రతిపక్షంగా ఉండే బలం కూడా లేదని పార్టీ పత్రిక సామ్నా లో రాసిన వ్యాసంలో విమర్శించింది. అంతేకాదు ‘మునిగిపోతున్న నావకు ఏచూరి కెప్టెన్ లాంటివాడని అభివర్ణించింది. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పదవీకాలం వైఫల్యం చెందింది. పశ్చిమబెంగాల్లో మూడు దశాబ్దాల పాటు పాలించిన ఆ పార్టీ మమతా బెనర్జీ రాకతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు లోక్ సభలో 50 మంది సభ్యులతో సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు కనీసం 10 మంది సభ్యులు కూడా లేరు అని సేన ఎద్దేవా చేసింది. పార్టీ హోదాలో అపారమైన నిరాశ, నైరాశ్యం ఉందని, వాస్తవానికి ఏచూరి మునిగిపోతున్న నావకు కెప్టెన్ అయ్యారంటూ వ్యాఖ్యానించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ