కేటీఆర్ ఆ విషయంలో జగన్ ను మించిపోయాడు

October 15, 2015 | 05:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ktr-jagan-somireddy-amaravathi-niharonline

ప్రతిపక్ష నేత హోదాలో  నవ్యాంధ్ర నూతన రాజధాని  శంకుస్థాపనకు హజరుకాకపోవటంపై జగన్  సీన్ క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఓవైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమరావతి శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతుంటే దీక్ష పేరుతో అనవసర రాద్ధాంతం చెయ్యటంతో సహనం నశించిన అధికార పక్ష నేతలు ఇది సబబు కాదని మండిపడుతున్నారు.  అంతేకాదు ఆహ్వాన పత్రిక అందజేస్తే తాను రాలేనని చెప్పటంతో ఇంకాస్త సీరియస్ గానే స్పందించారు.

జగన్ ను తాము అమరావతి శంకుస్థాపనకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ మీడియా సమక్షంలో తెలిపారు. పిలవడం తమ ధర్మమని, వచ్చేదీ, రానిదీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఎవరు వచ్చినా, రాకున్నా కార్యక్రమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అమరావతిని ఆపాలని ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ఆగవని అన్నారు.

ఇక మరో నేత టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం (ప్రతిపక్ష నేత)లో ఉన్న వ్యక్తిలా జగన్ ప్రవర్తించడం లేదని... అతని వ్యక్తిత్వం కుర్రతనంలా ఉందని ఎద్దేవా చేశారు. శంకుస్థాపనకు హాజరు కాలేనని జగన్ ప్రకటించడాన్ని సోమిరెడ్డి తప్పుబట్టారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెజ్ ల పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కున్నారని... అలాంటి వ్యక్తులకు అమరావతి గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలున్నప్పటికీ... తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. విభజన వల్లే ఒకరకంగా ఏపీకి మహర్దశ పట్టుకందని వ్యాఖ్యానించాడు. రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలున్నప్పటికీ, కొన్ని విషయాల్లో కలసి ముందుకు పోవాల్సి ఉంటుందని సూచించారు. మొత్తానికి కేటీఆర్ మెచ్యూరిటీ ముందు జగన్ తేలిపోయాడని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ