లంచమా... బహుమానమా... కానుకా!

July 17, 2015 | 04:00 PM | 9 Views
ప్రింట్ కామెంట్
trs_tdp_cash_for_vote_scam_niharonline

దొంగతనం జరిగినందుకు కాదు, దొరికిపోయినందుకు చేతగాని దొంగగార్కి ఛడామడా అక్షింతలేసే కలికాలపు రోజులివి. అప్పటి స్వర్ణయుగంలో దొంగలు ఒంటినిండా ఆముదం రాసుకుని అమ్మోరికి బలి సమర్పించుకుని, అమవాస్యరోజున తగు జాగ్రత్తలు తీసుకుని బయల్దేరి, దిగ్విజయంగా తిరిగివచ్చి శభాష్ అనిపించుకునేవారు.

                       నాకేటవుద్ధి అని పట్టపగలే సంచి నిండా నోట్ల కట్టలేసుకుని తప్పుడు పని చేసేందుకు ఏ విధమైన రెక్కీ నిర్వహించకుండా, నేరుగా స్టీఫెన్ భాయ్ దగ్గరకు వెళ్లి పోలీసుల బోనులో ఇరుక్కుపోయేరు అజానుబాహుడు రేవంతుడు అండ్ కో. అక్కడితో ఆగిందా ఆ సుగంధం అందరికి  పంచిపెట్టే బృహత్ యజ్నం జరుగుతుంది. దీనివెనుక కుట్ర ఆషామాషీ కాదు, నా రాజ్యం కూలదోసే యత్నమిది అని కేసీఆర్ కుట్రదారులందర్నీ అష్టదిగ్బంధనం చేయిస్తున్నారు. పనిలోపనిగా రేపు పార్లమెంటు సమావేశాల్లో మీ మిత్రపక్షం ఎంత పతివ్రతో చూశారుగా, ఏవంటారు అధ్యక్షా అని కాంగ్రెస్ వారు రాహుల్ గాంధీజీతో కొండంత రాగం తీయంచబోతున్నారట. ఎంఎల్సీని కొనుగోలు చేసేందుకు పూర్వానుభవం లేని బుడుగుని ముందుకు తొయ్యడం, తగుదునమ్మా అని శ్రీరేవంతు మహరాజే తయారయ్యి వ్యవహారాన్ని బెడిసి కొట్టించడం! మరి ఇదే నాణేనికి రెండోవైపు తలసాని, తుమ్మలను సైలెంటుగా పిలిచి పిల్లనిచ్చి ఇల్లరికం పెట్టుకున్నారు. అదెంతో ఇదంతే... కానీ, ఒప్పుకోరు గురూ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ