గ్రేటర్ ఎన్నికల్లో నైతిక విజయం ఎవరిదంటే...

February 06, 2016 | 11:57 AM | 2 Views
ప్రింట్ కామెంట్
settlers-votes-key-for-TRS-victory-in-GHMC-elections-niharonline

గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. కేవలం 20 నెలల పాలనలోనే 99 స్థానాల్లో గెలుపోంది విశ్లేషకులు సైతం ఆశ్చరువొందేలా చేసింది. ప్రతిపక్షాలకు సింగిల్ డిపాజిట్ లకే పరిమితం చేసి గులాబీ దండు ఘనవిజయం సాధించింది. ఫలితాలు స్వయానా టీ సీఎం కేసీఆర్ నే ఆశ్చర్యానికి గురిచేశాయంటే అతిశయోక్తికాదు. గ్రేటర్ ప్రజలందరూ ఇష్టపడి విజయాన్ని కట్టబెట్టారని, ఈ భారీ విజయంతో బాధ్యత మరింత పెరిగిందని  ప్రెస్ మీట్ కేసీఆర్ ప్రకటించడం విశేషం. అయితే ఇక్కడ ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటే చాలా విషయాలే అర్థమవుతాయి.

అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే  టీఆర్ఎస్ ఇన్ని సీట్లు గెలుస్తుందని బహుశా ఆ పార్టీ కూడా ఊహించి ఉండదు. కారణం, తెలంగాణకు ఆయువుపట్టులాంటి హైదరాబాద్ లో పాగా వేయటం అంత తేలిక కాదనే విషయం కేసీఆర్ కు ముందు నుంచే తెలుసు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ ఆ పార్టీ గెలిచింది తక్కువ సీట్లే. అయినప్పటికీ గ్రేటర్ ప్రజలు గులాబీ వైపే మొగ్గు చూపారు.

                     మొత్తం 45.27 శాతం పోలింగ్ నమోదవ్వగా, అందులో 29 శాతం సెటిలర్ల ఓట్లు కావటం విశేషం. అంతేకాదు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో గెలుపొందింది. అంటే సెటిలర్లు కూడా కారుకే మొగ్గుచూపారన్నమాట. అంతగా ప్రాబల్యం పార్టీలకు ఓట్లు వేయటం కంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేసి ఎంతో కొంత పనులు చేయించుకోవచ్చనేది వారి ఆలోచన అయి ఉండొచ్చు. అంతేకాదు వైఎస్ చనిపోయినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా హైదరాబాద్ లో అభివృద్ధి కుంటుపడిందనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఆపై అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాగునీటి వసతి, రోడ్ల స్థితి మెరుగు, కరెంట్ కోతలు లేకపోవటం ఇలా ఎంతో కొంత పురోగతి ఉండటంతో ప్రజలకు సైతం టీఆర్ఎస్ పై నమ్మకం కలిగింది. మారిన రాజకీయ సమీకరణాలు, విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతానడం, మరీ ముఖ్యంగా ఇక పై సెటిలర్లకు అండగా ఉంటానన్న కేసీఆర్ హామీ కూడా ఎంతో కొంత ప్రభావితం చేసింది. వెరసి గులాబీ జెండా గ్రేటర్ పై పాగా వేసేందుకు దోహదపడ్డాయి. ఎవరి అండా లేకుండా మేయర్ సీట్లో కూర్చోబోతుంది. అయితే ఓవరాల్ గా కేసీఆర్ చెప్పినట్లు ఇక్కడ నైతిక విజయం మాత్రం ముమ్మాటికీ ఓట్లరదే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ