బీసీసీఐ కాస్త తగ్గాల్సిన టైమొచ్చింది

August 17, 2015 | 01:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
DRS_BCCI_kohli_indian_team_srilanka_niharonline

టార్గెట్ చాలా తక్కువ... ప్చ్... అయినా ఓడిపోయాం. టైం బ్యాడ్. దారుణ పరాభవం. క్రీజ్ లో ఉండాల్సిన కాంసంట్రేషన్ కాస్త వీఐపీ గ్యాలరీలో ఉన్న అనుష్క పై ఉంటే ఆట ఎలా ఆడతాడు(కోహ్లీ నుద్దేశించి). రోహిత్ శర్మ ను అనవసరంగా తీసుకున్నారు. పుజారా ఉండుంటే గెలిచేది ఇలా కర్ణుడి చావుడి సవాలక్ష కారణాలు అన్న చందాగా, లంకతో మొదటి టెస్ట్ ఓటమిపై ఎవరికి తోచిన విమర్శలు వారు చేసుకుంటూ వస్తున్నారు. కానీ, మన ఓటమికి మరో కారణం కూడా ఉందండోయ్. అదే డీఆర్ఎస్. డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)... ఆటగాళ్ల అనుమానాస్పద ఔటలపై థర్డ్ అంపైర్ ను సంప్రదించేందుకు వీలుగా క్రికెట్ నియామవళిలో ఉన్న ఓ వెసులుబాటు. అన్ని దేశాలు దీనిని వాడుతున్నాయి. కానీ, ఒక్క భారత్ మాత్రం ఇందుకు మినహాయింపు.

ఈ విషయమై ఆది నుంచి బీసీసీఐ మొండి వైఖరి ప్రదర్శిస్తూనే ఉంది. డీఆర్ఎస్ వల్ల ఇప్పటికే చాలా కోల్పోయిందన్న విషయం ఒప్పుకుని తీరాలి. తాజాగా శ్రీలంకతో మొదటి టెస్ట్ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఈ మ్యాచ్ లో 150 పరుగులకు పైగా పరుగులు చేసి హీరోగా నిలిచాడు చండిమాల్. నిజానికి అతగాడు రెండు సార్లు అవుటయ్యాడు. 5 పరుగుల వద్ద ఒకసారి, 34 పరుగుల వద్ద మరోసారి. రెండు క్లియర్ అవుట్ లే. అయినా భారత్ డీఆర్ఎస్ ను వాడుకోకపోవటంతో బతికి బయటకట్టాడు.  గతంలో వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి డీఆర్ఎస్ లకు భారత్ దూరంగానే ఉంది. అవకాశం ఉన్నా నమ్మిన సిద్ధాంతం అంటూ డీఆర్ఎస్ ను వాడుకోకుండా అతిని ప్రదర్శించి భంగపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మొదటి టెస్ట్ ఓటమి తర్వాత కోహ్లీ కూడా ఇదే విషయాన్ని దృవీకరించాడు. ఇకనైనా కాస్త తగ్గి బీసీసీఐ ఈ విషయంలో పునరాలోచించాల్సిన సమయమోచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ