బీసీసీఐ మరీ కక్కుర్తి పడుతుంది

December 11, 2015 | 12:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bcci-plans-for-another-t20-league-niharonline

క్రికెట్ ఆటకు బాస్ గా ఉన్న ఐసీసీ కంటే రిచ్ బోర్డుగా ఉండి స్వతంత్ర్య నిర్ణయాలతో దూసుకెళ్తుంది భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). ఐపీఎల్ అనే పొట్టి ఫార్మట్ తో మొత్తం క్రికెట్ భవిష్యత్తునే మార్చేసింది. విదేశీ స్వదేశీ ఆటగాళ్ల కలయిక అయినప్పటికీ దేశీయ ఫ్లేవర్ తోనే కొనసాగే ఈ మ్యాచ్ లకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సంపాదించింది. దీంతో బీసీసీఐకి కాసుల గలగల కురిసింది. ఈ టోర్నీని ఆదర్శంగా తీసుకుని మరికొన్ని దేశాలు కూడా లీగ్ లను ప్రారంభించాయి కూడా. అయితే ఐపీఎల్ విలువల ముందు అవన్నీ బోల్తా కొట్టగ, ప్రస్తుతం తొమ్మిదో సీజన్ కు సిద్దమైపోతుంది.

                   ఆటతో ఎంత పాపులర్ అయ్యిందో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ప్రతిష్ట అంత దిగజారింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను తొలగించాల్సి వచ్చింది. వీటి నిష్క్రమణతో కొత్తగా పుణే, రాజ్ కోట్ జట్లు తిరిగి ఆ ప్లేస్ ను భర్తి చేయటానికి వచ్చాయి. ఈ జట్ల వేలం సందర్భంగా భారీ సంఖ్యలో కార్పొరేట్లు ఐపీఎల్ లో కాలు మోపేందుకు ఆసక్తి కనబరిచారు. రెండు జట్ల కోసం దాదాపు 20కి పైగా బిడ్లు దాఖలయ్యాయి. దాదాపు ఒక్కో ఆటగాడిపై కోట్లలో ఖర్చుపెట్టేందుకు వారంతా ముందుకు రావటంతో బీసీసీఐ కి మరో ఆలోచన మెదిలింది. కార్పొరేట్లలోని ఉత్సాహాన్ని గమనించిన బీసీసీఐ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ తరహాలోనే మరో టీ20 లీగ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో తెలిపారు. మరింత మంది కార్పొరేట్ దిగ్గజాలకు అవకాశం కల్పించే దిశగానే ఈ యోచన చేస్తున్నట్లు ఆయన అన్నారు. అయితే దానికి కాస్త టైం పట్టోచ్చని చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ