బౌలర్ కెప్టెన్సీ లో మిస్టర్ కూల్

December 10, 2015 | 12:59 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dhoni-under-varun-aaron-captaincy-niharonline

భారత టీంలో యువ బౌలర్ గా ఉన్న వరుణ్ ఆరోన్ నాయకత్వంలో టీమిండియా కెప్టెన్ ధోనీ ఆడనున్నాడు. అవును... కానీ, అది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో కాదులేండి. విజయ్ హజారే టోర్నీలో ఈ సన్నివేశం చోటు చేసుకోనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ధోనీ తన సొంత రాష్ట్రం జార్ఖండ్ లో ఆడుతున్నాడు. అయితే ఇక్కడ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వరుణ్ ఆరోన్ చేపడుతున్నాడు.

                    కెప్టెన్సీ చేపట్టాలని జార్ఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి రాజేష్ వర్మ ధోనీని కోరినప్పటికీ సున్నితంగా తిరస్కరించాడట. ఒకవేళ పాక్ తో సిరీస్ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం అయితే మాత్రం ఈ టోర్నీ నుంచి ధోనీ తప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అందుకే ధోనీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించలేదని సమాచారం. ఇక పాక్ సిరీస్ కోసం ప్రస్తుతం కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. అనుమతి లభిస్తే పాకిస్థాన్ తో సిరీస్ ధోనీ టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ