నైట్ రైడర్స్ బాహుబలిని మీరూ చూడండి

May 11, 2016 | 04:06 PM | 4 Views
ప్రింట్ కామెంట్
andre-russell-baahubali-niharonline

క్రికెటర్లు ఎప్పుడైనా పాపులర్ చిత్రాల పాత్రలో దర్శనమివ్వటం ఎప్పుడైనా చూశారా? ఫోటో షాప్ పుణ్యమాని విండీస్ క్రికెటర్ అండ్రీ రస్సెల్ బాహుబలి గెటప్ లో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. రస్సెల్ కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అండ్రెబలి అంటూ నైట్ రైడర్స్ ట్విట్టర్ పేజీలో ఆ ఫోటో దర్శనమిస్తోంది. మా వర్షెన్ బాహుబలిలో కట్టప్ప ఉండడు అంటూ పేర్కొంటూ పెట్టిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

9వ సీజన్లో 14 వికెట్లతో అండ్రూ రస్సెల్ భువనేశ్వర్ కుమార్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. మరోవైపు బ్యాటింగ్ లో అవసరం మేరకు బ్యాటింగ్ ఝుళిపిస్తూ రాణిస్తూనే ఉన్నాడు. అందుకే సరదా కోసం ఇలా అండ్రీబలి అంటూ ఫోటో షేర్ చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. రస్సెల్స్ తోపాటు పలువురు ప్లేయర్ల చిత్రాలను కూడా ఇలాగే దబాంగ్, రౌడీ రాథోడ్ అంటూ బాలీవుడ్ సినిమా పోస్టర్లుగా చేయించి పోస్ట్ చేస్తోంది కోల్ కతా టీం. వరుస విజయాలతో కోల్ కతా, హైదరాబాద్ సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండి టైటిల్ రేసులో ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ