స్పిన్ ద్వయం దెబ్బ... సఫారీలు అబ్బా!

November 26, 2015 | 11:22 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Ashwin_Jadeja_skittle_South_Africa_79_Nagpur

భారత్ ను సొంత గడ్డపైనే టీ20, వన్డే సిరీస్ లు సునాయసంగా ఓడించిన సఫారీలు గడ్డుకాలం ఎదుర్కుంటున్నారు. టెస్ట్ లో మాత్రం ఆ జట్టుకు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత బౌలర్ల స్పిన్ ధాటికి దక్షిణాఫ్రికా కుదేలైపోతుంది. గిర గిరా తిరుగుతూ వస్తున్న బంతులకు దక్షిణాఫ్రికా ఆటగాళ్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఫలితం నాగపూర్ లో జరుగుతున్న మూడవ టెస్టులో 33.1 ఓవర్లలో 79 పరుగుల వద్ద సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ ను ముగించగా, భారత్ కు 136 పరుగుల ఆధిక్యం లభించింది.

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కూడిన టీమిండియా స్పిన్ కు దక్షిణాఫ్రికా దాసోహమైంది. తొలి రోజు ఆటలో చెరో వికెట్ తీసుకున్న ఈ స్పిన్ ద్వయం, రెండో రోజు ఆటలో సింగిల్ పరుగు ఇచ్చి 7 కీలక వికెట్లను కుప్పకూల్చారు.  దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డుమినీ మాత్రమే 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. వాన్ జిల్, డెవిలియర్స్ ఖాతా తెరవకుండానే పెవీలియన్ దారి పట్టగా, ఆమ్లా, డీజే విలాస్, మోర్కెల్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ కు 5, జడేజాకు 4, మిశ్రాకు 1 వికెట్ లభించాయి. మరికాసేపట్లో భారత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ