బీసీసీఐ చీఫ్ పరిస్థితి విషమం?

September 18, 2015 | 09:43 AM | 1 Views
ప్రింట్ కామెంట్
jagmohan-dalmiya-heart-attack-niharonline

భారత క్రికెట్ బోర్డు చీఫ్ జగ్మోహన్ దాల్మియాకు గుండెపోటు వచ్చింది. గురువారం అర్థారాత్రి నిద్రించే సమయంలో ఆయన ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయారు. అనంతరం బంధువులు ఆయనను హుటాహుటిన కోల్ కతాలోని బీఎం బిర్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు దానిని గుండెపోటుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్ మెంట్ జరుగుతుంది. గతంలో సుదీర్ఘకాలంగా బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాల్మియా చాలాకాలంపాటు బోర్డుకు దూరంగానే ఉన్నారు.

                            అయితే ఐపీఎల్ లో మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పై విమర్శలు రావటం. ఆ తర్వాత శ్రీని తప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి దాల్మియా పేరు తెర మీదకొచ్చి మళ్లీ పగ్గాలు చేపట్టారు. రెండోసారి పదవిని చేపట్టే టైంకి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ