అతను ఆడితే పెద్దాయన టీవీకి అతుక్కుపోతాడట

September 17, 2015 | 11:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
laxman-zaheer-abbas-moinudeen-cup-niharonline

భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు తాను పెద్ద అభిమానినని ఐసీసీ అధ్య క్షుడు జహీర్‌ అబ్బాస్‌ పేర్కొన్నాడు. లక్ష్మణ్‌ ఆడుతుంటే తాను తప్పకుండా టీవీ ముందు కూర్చునే వాడినని తెలిపాడు. వీవీఎస్‌... ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్న విధానం తనకు బాగా నచ్చిందని చెప్పా డు. టీమిండియా కోసం లక్ష్మణ్‌ ఎంతో చేశాడని బుధవారం మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అబ్బాస్‌ చెప్పుకొచ్చాడు.

                                ఇక ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లోకి రాకముందు తాను కూడా మొయినుద్దౌలాలో ఆడానని లక్ష్మణ్‌ చెప్పాడు. ‘దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్‌ బౌలర్లను ఎదుర్కోవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతో ఇప్పుడు నేనీ స్థాయిలో ఉండగలిగాన’ని చెప్పాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ