బీసీసీఐకి క్లారిటీ కావాలంట

September 05, 2015 | 03:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
srinivasan-BCCI-annual-general-meeting-SC-niharonline.jpg

మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ తమ వార్షిక సర్వసభ్య సమావేశాని(ఏజీఎం)కి హాజరు కావచ్చా లేదా అన్న అంశంపై తగిన మార్గదర్శనం చేయాలని సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. ఈ మేరకు బీసీసీఐ గురువారం దాఖలు చేసిన పిటిషన్‌ వచ్చే వారం సుప్రీంకోర్టు పరిశీలనకు రానున్నది. తమిళనాడు క్రికెట్‌ సంఘం అధ్యక్షుడి హోదాలో శ్రీని సమావేశానికి హాజరు కావచ్చునన్న నేపథ్యంలో ఆగస్టు 28న జరగాల్సిన బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ భేటీ ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. బోర్డు నియమావళి ప్రకారం ఈ నెల 30లోగా ఏజీఎం జరగాలి. ఇందుకోసం మూడు వారాల ముందస్తు నోటీస్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27న ఏజీఎం నిర్వహించాలని బీసీసీఐ అనధికారికంగా నిర్ణయించినా అది జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఏజీఎం మరోసారి వాయిదా పడిన పక్షంలో ఈ విధంగా వాయిదా పడటం రెండోసారి అవుతుంది. దీంతో కోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ