జూనియర్ వాల్ అదరగొడుతున్నాడంతే...

September 04, 2015 | 01:03 PM | 4 Views
ప్రింట్ కామెంట్
dravid-sons-samit-anvay-niharonline.jpg

పలు రంగాల్లో లెజెండ్ లు వారి వారి వారసులను ఆయా రంగాల్లోనే రాణించేలా కృషి చేస్తుంటారు. మరికొందరు వారిని స్వేచ్ఛగా వదిలేసి ఇష్టానికి వదిలేస్తుంటారు. అయినా పిల్లలు మాత్రం ఆయా రంగాలను అస్సలు వదలరు. సచిన్ అర్జున్ టెండూల్కర్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. తండ్రి ఒత్తిడి లేకుండానే అర్జున్ క్రికెట్ లో ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ గా రాణిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రీడాదిగ్గజం వారసుడు క్రికెట్ రాణిస్తున్నాడు.

                          మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ఇప్పుడు క్రికెట్ లో ఓనమాలు దిద్దితూ రాణిస్తున్నాడు. 9 ఏళ్ల సమిత్ బెంగళూర్ లో జరిగిన అండర్ 12 మ్యాచ్ లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాస్తలో సెంచరీ మిస్ అయినప్పటికీ (93 పరుగులు) జట్టుకు భారీ స్కోర్ అందించడంలో తొడ్పడ్డాడు. దీంతో 16 ఓవర్లలో మాల్య అతిధి ఇంటర్నేషనల్ స్కూల్ 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది.  ప్రతిగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల కేవలం 107 పరుగులు మాత్రమే సాధించింది. కీలక విజయంలో పాలుపంచుకున్నందుకు పుత్రోత్సాహంతో ద్రావిడ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్లు బుల్లి వాల్ అంటే ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వే కూడా క్రికెట్ లో బాగానే రాణిస్తున్నాడు. ఆ మధ్య సోదరుడు సమిత్ తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లో అన్వే హడావుడి చేశాడు. ఈ సందర్భంగా ఓ డైవ్ క్యాచ్ పట్టి అక్కడున్న వారందరి దృష్టిని అన్వే ఆకర్షించాడు కూడా. మొత్తానికి జూనియర్ వాల్, బుల్లి వాల్ లు తండ్రిలా అదరగొడుతున్నారంతే...  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ