టీమిండియా కోచ్ గా జహీర్ డౌటే!

September 24, 2015 | 12:48 PM | 2 Views
ప్రింట్ కామెంట్
zaheer-khan-as-indian-team-bowling-coach-niharonline

వరుస సిరీస్ లు గెలుస్తున్న భారత జట్టులో బౌలింగ్ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బ్యాట్స్ మెన్ లు రాణించడం మూలంగానే మ్యాచ్ లు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి మాత్రం ఇప్పటికీ వీక్ గానే కనిపిస్తోంది. ముఖ్యంగా పేస్ విభాగంలో. స్పిన్నర్లు రాణిస్తున్నప్పటికీ శుభారంభాన్నిచ్చే పేస్ బౌలర్లు కరువయ్యారు. ఓ పదిహేనేళ్ల క్రితం జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి స్టార్ బౌలర్లతో టీమిండియా కళ కళ లాడుతూ కనిపించేది. ఆ తర్వాత టీమిండియా బౌలర్ జహీర్ ఖాన్ ఆ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నాడు. ముఖ్యంగా తొలిస్పెషల్ లో వికెట్ తీయనిది నిద్రపోయేవాడు కాదు. స్టార్ బ్యాట్స్ మెన్లు సైతం జహీర్ ఖాన్ బౌలింగ్ ను ఎదుర్కొనలేక చాలా ఇబ్బందులు పడేవారు.

అలాంటి జహీర్ గత కొద్ది కాలంగా టీమిండియాకు, ఆటకు దూరంగా ఉంటున్నాడు. కీలకమైన సిరీస్ లకు కూడా జహీర్ ను పక్కన పెట్టడంతో ఇక అతని పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో బీసీసీఐ కి వచ్చిన ఓ ఆలోచన అద్భుతం. అదే టీమిండియా బౌలింగ్ కోచ్ గా జహీర్ ను ఎంచుకోవటం. సుదీర్ఘ అనుభవంతోపాటు, విదేశీ పిచ్ లపై ఆడిన ట్రాక్ జహీర్ సొంతం. దేశీవాళీ మ్యాచ్ లో మంచి ప్రతిభ కనబరుస్తున్న యువ కెరటాలు అంతర్జాతీయ వేదికలపైకి వచ్చేసరికి ఢీలా పడిపోతున్నారు.  దీంతో అతన్ని కోచ్ గా నియమిస్తే ఆటగాళ్లు రాటుదేలే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను జహీర్ ఇప్పడు అంగీకరించేది అనుమానమే. తనకు ఇంకా కొంతకాలం ఆడాలని ఉందని జహీర్ ఆ మధ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతను అంత సులువుగా కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని అనుకోలేం. అదే టైంలో శ్రీనాథ్, ప్రసాద్ లాంటి సీనియర్ల నుంచి అతనికి గట్టి పోటీ ఉంటుంది. అయితే జహీర్ వైపే మొగ్గు చూపుతున్న బోర్డు ఎలాగైనా సరే అతన్ని ఒప్పించాలన్న నిశ్చయంతో ఉందట. ఇందుకోసం అతనికి సన్నిహితులైన ఆటగాళ్లను బరిలోకి దించి రాయబారం నడపాలని అనుకుంటుందట. చూద్దాం జహీర్ అందుకు ఒప్పుకుంటాడో లేడో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ