బోర్డు ఎన్నికల్లో గెలిచే తోపు ఎవరు?

September 23, 2015 | 04:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
BCCI-next-president-pawar-amithabh-srinivasan-shukla-niharonline

దాల్మియా హఠాన్మరణంతో  ఇప్పుడు తర్వాతి చర్చ మొదలైంది. అదే భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ ఎవరని? అయితే ఇంతకాలం ఏకపక్షంగా అధ్యక్షుడిని సంప్రదాయానికి ఈ సారి గండిపడేలా ఉంది. ఈ దఫా బోర్డుకి ఎన్నికలు తప్పేలా లేవు. తమ టైం బ్యాడ్ గా ఉండి ఇన్నాళ్లు సైలెంట్ అయిపోయిన వారంతా తిరిగి తెరపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోర్డుల్లోని తమ తమ వర్గాలను కెలుకుతూ ఎన్నికల సమయం వరకు సిద్ధమయ్యేలా ఫ్లాన్ వేస్తున్నారు. రేసులో మాజీ అధ్యక్షడు శరద్ పవార్ తోపాటు, శ్రీనివాసన్, రాజీవ్ శుక్లా తదితరులంతా ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే వీరందరికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈస్ట్ జోన్ తన అభ్యర్థిగా అమితాబ్‌ చౌదరిని బరిలోని దించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో వైరి వర్గాల ఎత్తులు పైఎత్తుల మధ్య బీసీసీఐ బిగ్‌బాస్‌ ఎవరనేది మరింత ఆసక్తికరంగా తయారైంది.
ప్రస్తుతం సొంత అభ్యర్థినే నిలబెట్టడానికి ఈస్ట్ జోన్ నిర్ణయించుకోవడంతో అసలు కథ మొదలైంది. బోర్డు నిబంధనల ప్రకారం ఈ దఫా అధ్యక్ష పదవి ఈస్ట్ జోన్ కే సొంతం. దీంతో జార్ఖండ్‌కు చెందిన అమితాబ్‌ చౌదరి పేరును ప్రతిపాదించాలని భావిస్తోంది. కానీ ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా, మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అదే టైంలో ఈస్ట్ జోన్ మద్ధతు వీరికి లభించడం కష్టం. అమితాబ్‌ ఓ ఐపీఎస్‌ అధికారి. జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘాన్ని స మర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఆఫీస్‌ బేరర్‌గా వార్షిక సర్వసభ్య సమావేశాలకు హాజరవుతున్నాడు. నాలుగు ఈస్ట్‌ జోన్‌ యూనిట్లు చౌదరికి మద్దతునిస్తున్నాయి. 2017 వరకు ఈస్ట్‌ జోన్‌ అభ్యర్థే అధ్యక్ష పీఠంపై ఉండాలి. అలాకాక పోతే ఎన్నికలు తప్పవు.
శరద్ పవార్‌ బరిలో నిలిస్తే క్యాబ్‌, ఎన్‌సీసీలు కచ్చితంగా ఓటు వేయవని సీనియర్‌ ఈస్ట్‌ జోనల్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇక తర్వాతి అధ్యక్షుడు రాజీవ్‌ శుక్లానే అని భారీగా ఊహాగానాలు వినిపిస్తున్నా.. సమీకరణలు అతనికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈస్ట్‌జోన్‌ నుంచి శుక్లాకు మద్దతు దొరకడం కష్టమే..! ఒకవేళ ఈస్ట్‌జోన్‌ యూనిట్లు తమ సొంత అభ్యర్థిని నిలబెట్టకుండా శుక్లా ఒప్పించగలిగితే కొంత అవకాశం ఉంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ కూడా చక్రం తిప్పడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ ఒంటెద్దు పోకడలతో గుర్రుగా ఉన్న శ్రీని వర్గం ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలగా ఉంది. మొత్తానికి వర్గపోరులతో ఈ దఫా ఎన్నికలు తప్పేలా లేవు. ఒకవేళ అదే జరిగితే గనుక రాజకీయ ప్రభావంతో ఎలక్షన్లు ఆసక్తికరంగా మారనున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ