ప్రజలా? ఐపీఎలా? డిసైడ్ చేసుకోండి

April 06, 2016 | 04:48 PM | 1 Views
ప్రింట్ కామెంట్
IPL_Bombay_HC_MCA_water_waste_niharonline

ఐపీఎల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉండగా బాంబే హైకోర్టు నిర్ణయంతో నిర్వాహకులు సంగ్ధిగ్ధంలో పడ్డారు.  మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించరాదంటూ దాఖలైన పిల్ ను బుధవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరువు తీవ్ర తాండవం చేస్తోంది. పిచ్ ల తయారీ కోసం నీటిని విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన హైకోర్టు ఐపీఎల్ మ్యాచ్ ల కంటే నీరు ముఖ్యమని, నీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోకుంటే ఐపీఎల్ మ్యాచ్ లను మహారాష్ట్ర నుంచి వేరే చోటకు తరలించాలని హెచ్చరించింది.

                       'నీళ్లను ఎందుకు వృథా చేస్తారు? ఐపీఎల్ కంటే ప్రజలు ముఖ్యం కాదా? ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారు? నీటిని వృథా చేయడం నేరం. మహారాష్ట్రలోని కరువు పరిస్థితుల గురించి మీకు తెలుసు కదా' అంటూ బాంబే హైకోర్టు ఎంసీఎకు ప్రశ్నల వర్షం కురిపించింది. నీటిని వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు తాండవిస్తున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను రాష్ట్రంలో నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పిచ్ ల కోసం ఇప్పటిదాకా 60వేల లీటర్ల నీటిని వృథా చేసింది ఎంసీఏ.  షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్‑పూర్‑ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ కష్టంగా మారనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ