లిటిల్ మాస్టర్ ను వదిలించుకునే పనిలో బీసీసీఐ?

April 05, 2016 | 12:02 PM | 2 Views
ప్రింట్ కామెంట్
gavaskar_bcci_expensive_commentator_niharonline

టెస్ట్ దిగ్గజం, టీమిండియాకు వివిధ రూపాల్లో సేవలందిస్తున్న సీనియర్ ఆటగాడిని ఇక వదిలించుకోవాలని బీసీసీఐ భావిస్తోందా? ఈ నెలలో సునీల్ గవాస్కర్ కాంట్రాక్టు ముగియనుండటంతో,  భరించలేక వదిలించుకోవటం ఖాయమని బీసీసీఐ బోర్డు వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫీజు రూపంలో గవాస్కరుకు ఇచ్చే మొత్తం అధికమని అనుకొంటున్న బీసీసీఐ పెద్దలు, సంజయ్ మంజ్రేకర్ లేదా హర్షా భోగ్లేలలో ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

                                           కాగా, కామెంటేటర్లకు రోజుకు రూ. 35 వేల నుంచి రూ. 1 లక్షల వరకూ ఇస్తున్న బీసీసీఐ, గవాస్కర్ కామెంట్రీ చెబితే మాత్రం 8 రెట్లు అధికంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గవాస్కరును తప్పిస్తే, ఆయన స్థానంలో రవిశాస్త్రిని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని, ఆయన అంగీకరించకుంటే మంజ్రేకర్, హర్షల్లో ఎవరికో ఒకరికి ఆ చాన్స్ దక్కే అవకాశం ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ