కుర్రాళ్లకు కత్తిలాంటి అవకాశం

September 16, 2015 | 02:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
dravid-team-A-coach-bangla-A-series-niharonline

కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెలలో జరిగే వన్డే, టీ20 సిరీస్ కు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో జరగబోయే ఓ సిరీస్ ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తుంది. బంగ్లాదేశ్ ఎ తో భారత్ ఎ మూడు వన్డేల ఓ సిరీస్ ఆడబోతుంది. బుధవారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పుడు కుర్రాళ్లంతా ఈ సిరీస్ లో ఎలాగైనా రాణించాలని, తద్వారా సఫారీ పర్యటనకు ఎంపిక కావాలని ఆశపడుతున్నారట. కరుణ్ నాయర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, ధవల్ కులకర్ణి, కర్ణ్ శర్మలతోపాటి ఉమ్మక్త్ చంద్, మయాంక్ అగర్వాల్ కూడా ఈ సిరీస్ పై గంపెడాశలు పెట్టకున్నారు.

రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో ఆరితేరిన జట్టు ఎలాగైనా టీమిండియాలో చోటుకోసం తెగ ఉబలాటపడుతున్నారట. దీనిపై ద్రావిడ్ స్పందిస్తూ ఆల్రెడీ బ్యాటింగ్ లో యంగ్ టీం బాగా రాణిస్తుందని, ఇఫ్పుడు బౌలింగ్ విభాగాన్ని పదును చెయ్యాల్సిన అవసరం ఉందని తెలిపాడు. సెలక్టర్లను ఆకర్షించేందుకు ఇంతకన్నా మంచి అవకాశం యువ ఆటగాళ్లకు దొరకదని అభిప్రాయాన్ని ద్రావిడ్ వ్యక్తంచేశాడు.

ఇక ఈ మ్యాచ్ ల్లో స్టార్ బ్యాట్స్ మెన్ రైనా కూడా ఆడుతున్నాడు. గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న రైనా ఎలాగైనా ఈ సిరీస్ లో రాణించి జట్టులో చోటు సంపాదించాలని ఆరాటపడుతున్నాడు. చివరిసారిగా రైనా ఆడిన బంగ్లా సిరీస్ లో స్కోర్ పెద్దగా స్కోర్ చెయ్యకపోవటంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ