స్పెషల్ స్టోరీ: క్రికెట్ ఓ అడిక్షన్

September 15, 2015 | 01:07 PM | 1 Views
ప్రింట్ కామెంట్
cricket-addiction-special-story-niharonline.jpg

స్నేహితులందరినీ దగ్గరికి చేసే వ్యాపకాలు ఎన్ని ఉన్నా... క్రి కె ట్ ను మించింది లేదనేది చెప్పాలి. మూడు కర్రల ఆ ఆటకి అంత మహాత్యం ఉంది మరి. వన్డే, టెస్ట్, టీ20, ఐపీఎల్ ఫార్మట్ ఏదైనా దానిపై మా మక్కువ అస్సలు తగ్గదు. క్రికెట్ కు బానిసలం... కాదు పూజీకులం. క్రికెట్ ఆడేవారిని ఆరాధిస్తాం. అవసరమైతే దేవుళ్ల ఫోటో పక్కన పెట్టి పూజిస్తాం. సెలబ్రిటీలు కూడా అందుకేం మినహాయింపు కాదు. క్రికెట్ కు అందరూ సమానమే.

గెలిచిన ప్రతీసారి ఆడకపోయినా ఏదో పొడిచినట్లు విజయంలో మేమే భాగస్వాములమని గర్వంగా ఫీలవుతాం. లైవ్ లో చూస్తున్నప్పుడు గ్రౌండ్ లో చేసే కోలాహలం కన్నా... ఇంట్లో టీవీలో చూసేపపుడు మరీ ఎక్కువ చేస్తాం. ఆఖరికి టీవీ ని వాస్తులో ఉంచి మరీ చూస్తాం. అరరె వాడు ఫలానా ఫోజులో ఉన్నప్పుడు రైనా సిక్సర్ కొట్టాడురోయ్ వాడిని అలాగే ఉంచండి అని తొటి స్నేహితులను ఆదేశిస్తాం. ఎప్పుడూ దేవుడిని ప్రార్థించని మేం మ్యాచ్ కోసం మొక్కుతాం. అవసరమైతే యాగాలు కూడా చేస్తాం.

గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తే ఇంక భూమ్మీదనే ఉండం. సంప్రదాయాల్ని పాటిస్తూ... డ్రెస్ కోడ్ తో నానాహంగామా చేస్తాం. అరుస్తాం... గీ పెడతాం. నెత్తుకొట్టుకుంటాం. గుండె పట్టుకుంటాం... పక్కోడితో విక్టరీ సైన్ చేస్తాం... క్లాఫ్స్ కొడతాం. టీవీలో చూసినా సేమ్ టూ సేమ్ అనుకోండి.

గ్రౌండ్ లో కాకపోయినా, గల్లీలో అయినా మా సరదా తీర్చుకుంటాం. మూడు కర్రలు, లేదా గోడకు గీతలు, అది వీలు కాకపోతే కుర్చో, స్టూలో, రాయో కాదేదీ క్రికెట్ కు అనర్హం. ఆటగాళ్లను అనుకరిస్తూ ఆనందిస్తాం.

మగాళ్లకే ఈ ఆటకు ఆడాళ్లూ బానిసలే. ఓ మెట్టు ఎక్కువ ఎక్కి ఆటగాళ్లను ఆరాధించటంతోపాటు ప్రేమిస్తారు కూడా... రైనాకి పెళ్లయితే ఏడుస్తారు.. కోహ్లీ అనుష్క తో కనిపిస్తే కోపం ప్రకటిస్తారు, యువీ మ్యాచ్ లో లేడంటే ఫీలవుతారు. టాటూలు వేయించుకుంటారు. అంత పిచ్చి మరి.

క్రికెట్ కు చెదలు పట్టింది... బూజు పట్టింది... భ్రష్టుపట్టింది... రాజకీయాలు నడుపుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతుంది. ఫిక్సింగ్ భూతం వెంటాడుతోంది. ఆటగాళ్లు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు. ఇవన్నీ విమర్శల కోణం...

కానీ, మాకవేం అవసరం లేదు. పట్టించుకోం కూడా.  కోహ్లీ క్రాఫ్ ను చేయించుకుంటాం. ధోనీలా లాంగ్ హెయిర్ పెంచుతాం. ధవన్ లా మీసం మెలేస్తాం. గేల్ లా గంగ్నమ్ డాన్స్ చేస్తాం. దాదా లా షర్ట్ విప్పుతాం.. ఆటలో వారి వారి స్టైళ్లను అనుకరిస్తాం.  ఏదైనా... ఏం జరిగినా మేం మాత్రం క్రికెట్ కు బానిసలం    

                                                                                                                                        ఇట్లు

                                                                                                                                      ఓ క్రికెట్ పిచ్చోడు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ