ఇంతకీ చెన్నై చేసిన పాపం ఏంటి?

November 24, 2015 | 12:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Chennai_miss_out_on_hosting_T20_World_cup_ matches

ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వటం ఓ గొప్ప గౌరవం. అలాంటిది చేజేతుల్లారా వచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకుంటుంది చెన్నై లోని చిదంబరం స్టేడియం. బంగారం లాంటి ఆ అవకాశాన్ని చెన్నై అసలు ఎందుకు దూరం చేసుకుంటుంది. విషయంలోకి వెళ్లితే... వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన ఈ సిరీస్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు స్టేడియాలు ఎంపికయ్యాయి. అయితే పొట్టి క్రికెట్ లో ప్రతిష్ఠాత్మకమైన ఈ సిరీస్ కు ఆతిథ్యమిచ్చేందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు ఇప్పటికీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐతో మంతనాలు కొనసాగిస్తూనే ఉంది. అయితే చిదంబరం స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

                         దీనికి గల కారణాలను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మంగళవారం మీడియాతో తెలిపారు.  టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికయ్యే పరిస్థితులు ప్రస్తుతానికి లేవని ఠాకూర్ చెప్పారు. స్టేడియంలోని కొన్ని స్టాండ్స్ పై చెన్నై కార్పొరేషన్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ, స్టేడియంలోని అన్ని సీట్లకు సంబంధించిన టికెట్ల విక్రయానికి అనుమతి లభిస్తేనే మ్యాచ్ ల నిర్వహణకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. అలాంటి పరిస్థితి లేని స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహించలేమని కూడా బీసీసీఐకి చెప్పింది. ఈ నేపథ్యంలో చిదంబరం స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. సమస్య సానుకూలంగా పరిష్కారం అయినప్పటికీ చెన్నైకి దక్కే ఛాన్స్ తక్కువే అని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ