హడావుడిగా దాయాదుల పోరు ఎందుకు?

December 09, 2015 | 11:59 AM | 5 Views
ప్రింట్ కామెంట్
India-Pakistan-series-dates-fixed-niharonline

క్రికెట్ ప్రపంచంలో ముద్దుగా ‘దాయాదుల పోరు’ అని పిలుచుకునేది ఏదంటే భారత్-పాకిస్థాన్ ల మధ్య జరిగే  మ్యాచ్. అయితే బెడిసి కొట్టిన సంబంధాల నేపథ్యంలో సిరీస్ పై నీలినీడలు కమ్ముకోగా వాటిని తొలగించేందుకు ఇరు దేశాల బోర్డులు బాగా ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ వారి కవ్వింపు చర్యలకు బాధ్యులైన దేశంగా భారత ప్రభుత్వం విముఖతతో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సిరీస్ కు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. దీనిపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటననేది విడుదల కాకపోయినా, త్వరలో కేంద్రం నుంచి తీపి కబురు రావడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.

ఇటీవల థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ, తాజాగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటన ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని కాస్తంత చల్లబరిచాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ముంబై దాడుల తర్వాత నిలిచిపోయిన ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కు కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇఫ్పటికే దీనిపై బీసీసీఐతో చర్చించిందని, దీనికి స్పందించిన బీసీసీఐ షెడ్యూల్ ను కూడా అందజేసిందని సమాచారం. ఈ నెల 24 నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా మొదలు కానున్న సిరీస్ వచ్చే నెల 5న ముగిసేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. అయితే చివరిసారిగా సిరీస్ మాత్రం జనవరి చివర్లో జరిగింది. దీంతో స్పష్టత లేకుండానే బీసీసీఐ ఎందుకింత హడావుడి చేస్తుందా అని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతకొద్ది కాలంగా క్రికెట్ లో మజా కు దూరమైన అభిమానులకు మాత్రం ఇండో పాక్ సిరీస్ అంటే మాత్రం పండగలాంటిదనే చెప్పవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ